పల్లెల్లో ‘పచ్చ’ చిచ్చు..

30 Jan, 2021 08:43 IST|Sakshi

ఏకగ్రీవాలకు అడ్డంకిగా మారిన టీడీపీ కార్యకర్తలు 

ఇందుకోసం ప్రలోభపర్వం అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు గ్రామకక్షలకు కుట్ర

టీడీపీ తీరుపై జనాగ్రహం 

సాక్షి, ప్రతినిధి కడప: గ్రామపంచాయతీ ఎన్నికలు వేదికగా గ్రామాల్లో చిచ్చు రేపేందుకు ప్రతిపక్ష టీడీపీ వ్యూహరచన చేస్తోంది. బలం సంగతి దేవుడెరుగు కేడర్‌ లేకున్నా నామినేషన్లు వేయించి వర్గ విబేధాలను మరింత పెంచి తద్వారా గ్రామాల్లో గొడవలు పెట్టేందుకు సిద్ధమైంది. పల్లెలు అభివృద్ధికి నోచుకోకూడదన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 807 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా 14 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచి పోయాయి. చదవండి: నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా

ప్రస్తుతం 793 గ్రామపంచాయతీల్లో 7,762 వార్డులకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి విడతలో బద్వేలు, మైదుకూరు,ప్రొద్దుటూరు నియోజక వర్గాల్లోని 206 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచే ఇక్కడ నామినేషన్లు ప్రక్రియ మొదలైంది. ఏకగ్రీవం చేసుకొనేందుకు ఆయా పంచాయతీల ప్రజలు సిద్ధమయ్యారు.ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులు పొంది పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని వారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. తద్వారా గ్రామ కక్షలకు ఆస్కారం లేకుండా చేసుకోవాలన్నది లక్ష్యం. అయితే ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ కుట్రలకు దిగింది. చదవండి: కోడ్‌ పేరిట పేదల పథకానికి బ్రేక్

కార్యకర్తలు లేకున్నా పోటీ అంటూ నామినేషన్లు 
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలో పోటీ ఉండేలా చూడాలని ఆ పార్టీ అధినేత కింది స్థాయినేతలకు ఆల్టిమేట్టం జారీ చేశారు. దీంతో కార్యకర్తలు లేక పోయినా ఎవరో ఒకరిని బతిమలాడో,  ప్రలోభపెట్టో పోటీ చేయించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కొని చోట్ల నామినేషన్‌ వేస్తే చాలు డబ్బులు ముట్ట జెపుతామంటూ బేరాలు పెడుతున్నారు.ఒకరిద్దరు కార్యకర్తలు ఉన్నచోట సైతం పోటీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.

అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీలు పెట్టించకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని గుర్తించేది లేదంటూ నియోజకవర్గ స్థాయి నేతలకు టీడీపీ అధినేత వారి్నంగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మండల స్థాయి నేతలు పంచాయతీ స్థాయి నేతల పై ఒత్తిడి పెంచారు.పైనుంచి కింద వరకూ ప్రతిపక్ష పార్టీ నేతలు నామినేషన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.ఎట్టి పరిస్థితిలో ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగేలా చూడాలన్న దురుద్దేశంతో టీడీపీ పావులు కదుపుతోంది. తద్వారా పచ్చని పల్లెల్లో కక్షలు రాజేస్తోంది.çప్రోత్సాహకం రూపంలో నిధులు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. తద్వారా పల్లెసీమల అభివృద్దికి అడ్డంకిగా మారుతున్నారు. ప్రతిపక్ష పార్టీ దిగజారుడు రాజకీయాలతో పల్లెల్లో గొడవలు జరిగే పరిస్థితులు ఉత్పన్న మౌతున్నాయని, అభివృద్దికి ఆటంకం ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు.

కనిపించని ఉనికి..
జిల్లాలో నామమాత్రపు పంచాయతీల్లో కూడా ప్రస్తుతం టీడీపీకి కేడర్‌ లేకుండా పోయింది. గత అయిదేళ్ల పాలనలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కరువు జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చే ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. ఆ పార్టీ జిల్లా నేతలు సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధికి మంగళం పాడారు. దీంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. పర్యవసానంగా గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఘోర పరాజయం పాలైంది. పది అసెంబ్లీ,రెండు పార్లమెంట్‌ స్థానాల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ దక్కించు కోలేక పోయింది. ఎన్నికల తరువాత టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు,ఇన్‌చార్జిలు పత్తా లేకుండా పోయారు. నియోజకవర్గాల వైపు తొంగిచూసిన పాపాన పోలేదు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు,నేతలు చాలామటుకు అధికారపార్టీలో చేరిపోయారు. నామమాత్రంగా మిగిలినవారు పార్టీ కార్యక్రమాలకు దూరమై మిన్నకుండి పోయారు. దీంతో జిల్లాలో చాలా పంచాయతీలలో ప్రతిపక్ష టీడీపీ పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది.    

మరిన్ని వార్తలు