నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్‌ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం..

27 Jun, 2023 14:44 IST|Sakshi

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్య

రాజకీయ రంగు పులిమే కుట్ర చేసిన తెలుగుదేశం

చనిపోయేముందు సెల్ఫీ వీడియోలు చేసిన శ్యామ్

వీడియోల విషయం తెలియక కుట్ర చేసిన టిడిపి

చంపేశారంటూ YSRCPపై బురద జల్లే ప్రయత్నం

సోషల్ మీడియాలో అసత్యాలు, అబద్దాల ప్రచారం

సెల్ఫీ వీడియోలు బయటకు రాగానే తేటతెల్లమైన కుట్ర

అసలు నిజాలు తెలియడంతో తేలు కుట్టినట్టుగా టిడిపి

సాక్షి, అమరావతి: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తమ పార్టీని బతికించుకునేందుకు టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మృతిపై చంద్రబాబు, లోకేష్ నిసిగ్గుగా శవరాజకీయాలకు తెరలేపారు. ఆ యువకుడి మృతికి వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు.

అసలేం జరిగింది? 

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యాం.. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ప్రాణం. వయస్సు 23 సంవత్సరాలు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. ఇటీవల చింతలూరు గ్రామానికి వెళ్లిన శ్యామ్ అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు.

తన అభిమాని శ్యాం మరణించినందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

తెర లేచిన శవరాజకీయం

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.  రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టిడిపి కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి YSRCPకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా శ్యామ్ చనిపోయాడని తెలియగానే.. తెలుగుదేశం రంగంలోకి దిగింది. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు. 

చంద్రబాబు నిర్వాకం ఇది

శ్యాం మరణం వార్త తెలియగానే, చంద్రబాబు దానికి రాజకీయ రంగు పులిమేశారు. ఇది వైఎస్సార్ సిపి పనేనంటూ నిందలు మోపారు.

తానా.. తందానా.. తనయుడి కూత ఇది

తండ్రి చంద్రబాబు బాటలోనే లోకేష్ నడిచారు. వెంటనే ఓ ట్వీటేశాడు. తన ఆస్థాన విద్వాంసులు రాసిచ్చిన నాలుగు వ్యాఖ్యలను జోడించారు.

తెలుగుదేశం శవరాజకీయం
శ్యాం మృతిపై తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు తమకు శ్యాం పంపించిన వీడియోలను పోలీసులకు అందించారు. శ్యాం ఆత్మహత్య చేసుకునేముందు ఏం జరిగిందన్నది ఈ వీడియోల్లో స్పష్టంగా ఉంది. శవాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం తండ్రీ కొడుకులు రాజకీయాలు  చేయడంతో వైఎస్సార్‌సీపీ స్పందించింది. 

ఇది ఎన్నికల సమయం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి విష ప్రచారాలు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తారు. రాష్ట్ర ప్రజలు గమనించాలంటూ వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

YSRCP ఏం చెప్పింది?

ఎన్టీఆర్‌ అభిమాని మృతిని టీడీపీ అవకాశంగా తీసుకుని నీచ రాజకీయాలు చేస్తుండగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ తన అభిమాని మరణం పట్ల  గౌరవంగా, పద్ధతిగా సానుభూతి తెలిపారు. శ్యామ్‌ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసు మనసు కలచివేస్తోందని, ప్రభుత్వం దీనిపై తక్షణమే దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేశారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు