నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

13 Feb, 2021 06:05 IST|Sakshi
టీడీపీ కండువాలతో నామినేషన్‌ కేంద్రానికి వచ్చిన పార్థసారథి తదితరులు

పార్టీ కండువాలతోనే నామినేషన్‌ కేంద్రం వద్దకు 

‘సాక్షి’పై నోరు పారేసుకున్న బీకే పార్థసారథి 

సోమందేపల్లి: అనంతపురం జిల్లా సోమందేపల్లిలో నామినేషన్ల దాఖలు సందర్భంగా శుక్రవారం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. నామినేషన్‌ కేంద్రానికి వంద మీటర్లలోపు జనం గుమికూడరాదనే నిబంధనలున్నా అనుచరులతో హడావుడి చేశారు. పార్టీ కండువాలు వేసుకుని నామినేషన్లు దాఖలు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఆయన తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగం చేసినా అధికారులు వారించలేదు. టీడీపీ నాయకులతో కలిసి శైలజ సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ పత్రాలు అందజేసినా అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం.  

ప్రభుత్వంపై అక్కసు 
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అభిమానులు పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుండటం మింగుడుపడని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. నామినేషన్‌ కేంద్రం వద్ద వార్తల సేకరణ కోసం ఉన్న ‘సాక్షి’ విలేకరి జాకీర్‌హుస్సేన్‌తో వాగ్వాదానికి దిగారు. పత్రికపై నోరు పారేసుకోవడంతోపాటు అనుచరులను ఉసిగొలిపి దౌర్జన్యానికి ప్రయతి్నంచారు. రాజకీయ సమావేశాలు పెట్టకూడదని పోలీసులు చెప్పినా బేఖాతరు చేశారు. బీకే పార్థసారథి కారులోని ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మీడియాను దుర్భాషలాడారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాంతి స్పందించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

మరిన్ని వార్తలు