ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!

12 Feb, 2021 07:54 IST|Sakshi
పంపిణీ చేసిన చికెన్‌ కూపన్‌ ఇదే..

డి.హీరేహాళ్‌: మంత్రాలకు చింతకాయలు రాలతాయని నమ్ముతున్నారో ఏమోగానీ.. టీడీపీ నాయకులు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హీరేహాళ్‌లో టీడీపీ నేత నాగళ్లి రాజు.. తాము బలపర్చిన అభ్యర్థి నాగమ్మ విజయానికి కొత్త తరహా కుట్రలకు తెరలేపాడు. ఈ నెల 13న(శనివారం) పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ నాటికి ఒక రోజు ముందు(శుక్రవారం) ప్రతి ఇంటికీ రెండు కిలోల చికెన్‌ అందజేసేలా కూపన్లు పంపిణీ చేశాడు.

అయితే ఆ కూపన్లపై మంత్ర, తంత్రాలతో కూడిన బొమ్మలు ముద్రించి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి స్వామీజీలను సంప్రదించారు. అవి కేరళ మాంత్రికుల సాయంతో రూపొందించిన తాంత్రిక యంత్రాలని తేలింది. ఈ కూపన్లు ఇచ్చిన వారు చెప్పినట్టుగా.. వాటిని తీసుకున్న వారు వింటారని స్వామీజీలు తేల్చి చెప్పడంతో డి.హీరేహాళ్‌ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నాగళ్లి రాజు భార్య పుష్పావతి సైతం మహిళల నుదుటన బొట్టు పెట్టి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఆ కుంకుమ కేరళ మాంత్రికులతో మంత్రించిందని మహిళా ఓటర్లు బెంబేలెత్తిపోతున్నారు.
(చదవండి: ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం)
రాబడి పెరగాలి: సీఎం జగన్‌ 
  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు