నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌..

5 Nov, 2021 10:44 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మున్వర్‌ టీడీపీకి గుడ్‌ బై చెప్పారు. తన అనుచరులతో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంత్రి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 'పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమానికి టీడీపీ నేతలు ఆకర్షితులవుతున్నారు. ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ములేక టీడీపీ అనైతిక పొత్తులకు పాల్పడుతోంది. లోపాయికారీ ఒప్పందాలతో కార్పొరేషన్‌ ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తోంది. అన్ని పార్టీలు కలిసొచ్చినా ప్రజలు వైఎస్సార్‌సీపీ వెంటే నిలుస్తారు. 54 డివిజన్లలో విజయడంఖా మోగించబోతున్నాము' అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.

చదవండి: (పరమ పవిత్రం మల్లన్న దివ్య పరిమళ ‘విభూది’)

మరిన్ని వార్తలు