కదిరి లాడ్జి బాగోతంలో.. కథ.. స్క్రీన్‌ప్లే అంతా టీడీపీనే!

25 Apr, 2022 03:50 IST|Sakshi
టీడీపీ నేత జొన్నా రామయ్యపై మండిపడుతున్న ఆయన సోదరులు, వారి కుటుంబ సభ్యులు

జొన్నా లాడ్జి వ్యవహారంలో దొంగే.. దొంగ దొంగ అన్నట్లుంది

2018లో రూ.9.50 కోట్లకు లాడ్జిన అమ్మిన టీడీపీ నేత రామయ్య

ఇప్పటికీ కొనుగోలుదారుడికి స్వాధీనం చేయని వైనం

రామయ్య వ్యవహార శైలిని తప్పుబట్టిన సొంత సోదరులు

‘కదిరిలో వైఎస్సార్‌సీపీ నేతల హల్‌చల్‌’ అంటూ ఈనాడు తప్పుడు కథనం

కదిరి: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రామయ్య లాడ్జి వివాదం ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ప్రత్యర్థి పార్టీని అభాసుపాలు చేయడానికి చేసిందేనని ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీలోని రామయ్య ప్రత్యర్థి వర్గీయులు స్పష్టంచేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కథ, స్క్రీన్‌ప్లే అంతా ఆయనా, టీడీపీదేనని వారు చెబుతున్నారు. వీరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5, తదితర ఎల్లో మీడియా తోడయ్యాయని.. వీటికి రామయ్య, టీడీపీ బాగోతం కనిపించడంలేదా అని కదిరి ప్రజలు మండిపడుతున్నారు.

వివాదం ఏమిటంటే..
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తన కుటుంబానికి చెందిన ‘జొన్నా లాడ్జి’ని 2018లో అనంతపురానికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్‌ యజమాని శ్రీధర్‌రెడ్డికి రూ.9.50 కోట్లకు విక్రయించారు. రిజిస్ట్రేషన్‌ సమయానికి రామయ్య అడ్డం తిరిగాడు. కానీ, మిగిలిన అన్నదమ్ములు మాత్రం తమ వాటా (60 శాతం)ను శ్రీధర్‌రెడ్డికి రిజిస్టర్‌ చేయించారు. రామయ్య మాత్రం తన 40 శాతం వాటాలో 20 శాతం వాటాను వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి అమ్మేశాడు. చంద్రారెడ్డి దాన్ని తిరిగి శ్రీధర్‌రెడ్డికి విక్రయించాడు. మొత్తమ్మీద 80 శాతం వాటా ఇప్పుడు శ్రీధర్‌రెడ్డిదే. కానీ, నాలుగేళ్లుగా లాడ్జిలో వచ్చిన ఆదాయాన్ని ఎంజాయ్‌ చేస్తూ.. దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికి అప్పగించకుండా జొన్నా రామయ్య గూండా గిరి చేస్తున్నారు.

రామయ్య వైఖరితో అన్నదమ్ముల విభేదం
రామయ్య వ్యవహార శైలి నచ్చక సొంత అన్నదమ్ములే ఆయనతో విభేదించారు. ఈ నెల 23న జొన్నా సోదరులంతా కుటుంబ సమేతంగా శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్జి ముందు బండ రాళ్లు వేసి రాకపోకలను స్తంభింపజేశారు. అక్కడే ఉన్న రామయ్యను లాడ్జిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని రామయ్య టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌తోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో శనివారం లాడ్జి ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిజానికి ఈ వ్యవహారంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గానీ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డికి గానీ ఎలాంటి సంబంధమూలేదు. కానీ, రామయ్య వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. అయితే.. వీరి వ్యవహార శైలిని టీడీపీలోనే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మా కుటుంబాన్ని రోడ్డుకీడ్చాడు : జొన్నా సోదరులు
ఈ ఘటనపై జొన్నా సోదరులు స్పందిస్తూ.. ‘జొన్నా ఫ్యామిలీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. మా కుటుంబాన్ని ఇప్పుడు బజారుకీడ్చిన మా అన్న రామయ్య కొందరి మాటలు విని, లాడ్జిని స్వాధీనం చేయకుండా జొన్నా కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు’ అని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు