సంతబొమ్మాళిలో టీడీపీకి ఎదురు దెబ్బ

14 Aug, 2020 13:13 IST|Sakshi
సంతబొమ్మాళి టీడీపీ శ్రేణులకు పార్టీ కండువా వేసి ఆహ్వానిస్తున్న కృష్ణదాస్, పక్కన టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌

దువ్వాడ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం 

సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక 

నరసన్నపేట: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా టెక్కలి సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మబగాం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కృష్ణదాస్‌ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

సంతబొమ్మాళి పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు రాంప్రసాద్, మర్రిపాడు, వడ్డివాడ నీటి సంఘం అధ్యక్షుడు బుడ్డ భీమారావు, బూడాన వసంతరావు, మాజీ ఎంపీటీసీలు బుచ్చల సావిత్రమ్మలతోపాటు అట్టాడ జగన్నాథరావు, సోమేశ్వరరావు, సోమ భారతి, కృష్ణవేణి, తదితరులు, నౌపడ నుంచి పారిశ్రామికవేత్తలు చెన్నూరు గౌరీప్రసాద్, రామపాత్రుని నారాయణరావులతోపాటు వందలాది మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ దేశంలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పాలన ఆదర్శంగా నిలిచిందన్నారు. 80 శాతం మంది రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ఆకర్షితులై పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, ఆయా గ్రామాల్లో తమ కార్యకర్తలతో కలసి పనిచేయాలని సూచించారు.  

మరిన్ని వార్తలు