ఓటమి భయం.. టీడీపీ నేతల బెదిరింపుల పర్వం

13 Nov, 2021 17:07 IST|Sakshi

వలంటీర్ల ఇళ్లకు వెళ్లి వార్నింగ్‌

వైఎస్సార్‌ సీపీ క్రియాశీలక కార్యకర్తలకు ఫోన్లలో తిట్లపర్వం

సాక్షి, తిరుపతి: ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ ఓటమి భయంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, వలంటీర్ల ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ వలంటీర్లకు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు.  24వ వార్డు వలంటీర్‌ గాయత్రి నివాసానికి వెళ్లి వైఎస్సార్‌ సీపీ తరఫున డబ్బులు పంచుతున్నావంటూ ఆమెతో గొడవకు దిగారు. తనకేమీ సంబంధం లేదన్నా వినకుండా టీడీపీ శ్రేణులు గుంపుగా నివాసంలోకి చొరబడి తీవ్రస్థాయిలో హెచ్చరించడమే కాకుండా, మరోసారి తమకు ఏదేని సమాచారం వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ తీవ్రస్థాయిలో బెదిరించారు.

చదవండి: Kuppam: డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు

వలంటీర్‌ ప్రాధేయపడుతున్నా వారు లెక్కచేయలేదు. అలాగే, క్రియాశీలక వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను టార్గెట్‌ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తిరిగే అంతు చూస్తామని, ఎవరికైనా చెబితే ఇబ్బందులు తప్పవంటూ ఫోన్‌ చేసి దూషిస్తూ వార్నింగ్‌ ఇస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లు రాకపోతే పరిస్థితి వేరేవిధంగా ఉంటుందంటూ నేరుగానే దౌర్జన్యాలకు దిగుతున్నారు. మరికొందరు కార్యకర్తల కదలికలపై టీడీపీ శ్రేణులు నిఘా పెట్టినట్లు సమాచారం.
చదవండి: త్వరలో టీడీపీ కనుమరుగు: అంబటి రాంబాబు  

మరిన్ని వార్తలు