టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు భంగపాటు

6 Mar, 2021 10:39 IST|Sakshi

కణేకల్లు: మండలంలోని బెణికల్లు గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు భంగ పాటు ఎదురైంది. వివరాలు.. తటస్థంగా ఉన్న కొన్ని కుటుంబాలతోపాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పార్టీలో చేర్పించేందుకు టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బలవంతంగా చేర్పించేందుకు యత్నించారు. కొందరికి పచ్చ చొక్కాలు కూడా కుట్టించి ఇచ్చారు. కొన్ని కుటుంబాలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని శుక్రవారం మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులను ఊరికి రప్పించారు.

కాలవ చేతుల మీదుగా కండువా వేయించాలనుకొన్నారు.. టీడీపీ నాయకులు. పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గతంలో టీడీపీలో ఉన్నోళ్లకే కండువాలు వేసి పార్టీలో చేరారని మాజీ మంత్రి గొప్పలు చెప్పి కార్యక్రమం ముగించేసి వెళ్లిపోయారు. కాగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసుల చేతుల మీదుగా కండువాలు వేయించుకొన్న ఎర్రిస్వామి, పోతప్ప, వన్నూరుస్వామి, సంగప్పతోపాటు మరో రెండు కుటుంబాలు టీడీపీకి చెందినవేనని బెణికల్లు గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు జేజేటీ ప్రభాకర్‌రెడ్డి, జేజేటీ నగేష్‌ రెడ్డి, భీమిరెడ్డి తెలిపారు. ఊళ్లో కొత్త వారేవరూ పారీ్టలో చేరనందున మాజీ మంత్రి పాతోళ్లకే కండువాలు వేసి కొత్త వారు చేరినట్లు ఫోజులిచ్చారని విమర్శించారు.
చదవండి:
తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ.. 
అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి 

 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు