టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

29 Mar, 2021 18:02 IST|Sakshi

టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోంది..

గోరంట్ల బుచ్చయ్య చౌదరి

సాక్షి, తూర్పుగోదావరి: వరుసగా ఎదురవుతున్న ఘోర పరాజయాల నేపథ్యంలో టీడీపీ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఉచ్చు బిగుసుకోవడంతో ఏంచేయాల్లో తెలియక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. పార్టీ బలహీనపడిన నేపథ్యంలో కొంతకాలంగా టీడీపీలో  నాయకత్వ మార్పుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది.

తాజాగా పార్టీ నాయకత్వ మారుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయంటూ ఆయన వెల్లడించారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోందంటూ ఆయన చేసిన కీలక వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చదవండి:
బీజేపీ - జనసేన పొత్తుపై మరోసారి సందిగ్ధం..
నామినేషన్ వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి

మరిన్ని వార్తలు