పార్లమెంట్‌ స్థానాలవారీగా టీడీపీ అధ్యక్షులు

28 Sep, 2020 05:39 IST|Sakshi

జాబితా విడుదల చేసిన చంద్రబాబు 

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో పార్లమెంట్‌ స్థానాల వారీగా పార్టీ అధ్యక్షులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌ నుంచి ఆ జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకూ జిల్లాల వారీగా ఆ పార్టీకి అధ్యక్షులున్నారు. వైఎస్సార్‌సీపీ 2019 ఎన్నికలకు ముందే పార్లమెంటు స్థానాల వారీగా అధ్యక్షులను నియమించింది. ఇప్పుడు చంద్రబాబు అదే విధానాన్ని అనుసరించారు. 

ఇదీ టీడీపీ జాబితా.. 
కూన రవికుమార్‌ (శ్రీకాకుళం ) , కిమిడి నాగార్జున (విజయనగరం), గుమ్మడి సంధ్యారాణి (అరకు). పల్లా శ్రీనివాసరావు (విశాఖపట్నం), బుద్ధా నాగ జగదీశ్వరరావు (అనకాపల్లి) , జ్యోతుల నవీన్‌ (కాకినాడ), రెడ్డి అనంతకుమారి (అమలాపురం). కేఎస్‌ జవహర్‌ (Æరాజమండ్రి). తోట సీతారామలక్ష్మి (¯నరసాపురం),  గన్ని వీరాంజనేయులు (ఏలూరు),  కొనకళ్ల నారాయణరావు (మచిలీపట్నం),  నెట్టెం రఘురాం (విజయవాడ), తెనాలి శ్రావణ్‌కుమార్‌ (గుంటూరు), జీవీ ఆంజనేయులు (నరసరావుపేట). ఏలూరి సాంబశివరావు (బాపట్ల),  నూకసాని బాలాజీ (ఒంగోలు ), షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ (నెల్లూరు), జి .నరసింహయాదవ్‌ (తిరుపతి),  పులివర్తి వెంకట మణిప్రసాద్‌ (నాని) (చిత్తూరు), రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి  (రాజంపేట  ), మల్లెల లింగారెడ్డి (కడప ), కాల్వ శ్రీనివాసులు (అనంతపురం), బీకే పార్థసారథి (హిందూపురం). సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు), గౌరు వెంకటరెడ్డి (నంద్యాల). 

సమన్వయకర్తలుగా సీనియర్లు.. 
రెండు పార్లమెంటు స్థానాలకు ఒక సీనియర్‌ నేతను సమన్వయకర్తగా చంద్రబాబు నియమించారు.  మచిలీపట్నం, గుంటూరు– కొండపల్లి అప్పలనాయుడు, కాకినాడ, అమలాపురం– బండారు సత్యనారాయణమూర్తి, శ్రీకాకుళం, విజయనగరం– పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు),  విశాఖపట్నం, అనకాపల్లి– నిమ్మకాయల చినరాజప్ప, నరసరావుపేట, బాపట్ల– పితాని సత్యనారాయణ, రాజమండ్రి, నర్సాపురం– గద్దె రామ్మోహన్, అరకు– నక్కా ఆనంద్‌బాబు, ఏలూరు, విజయవాడ– ధూళిపాళ నరేంద్ర, తిరుపతి, చిత్తూరు– ఎం ఉగ్రనరసింహారెడ్డి, కడప, రాజంపేట– సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల– వి.ప్రభాకరచౌదరి, అనంతపురం, హిందూపురం– బీటీ నాయుడు, ఒంగోలు, నెల్లూరు– బీసీ జనార్థన్‌రెడ్డి. 

మరిన్ని వార్తలు