-

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ సీనియర్‌ నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి 

28 Nov, 2023 04:26 IST|Sakshi

కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాచర్ల నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌ కొమ్మారెడ్డి చలమారెడ్డి సోమవారం తాడే­పల్లి­లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

చలమారెడ్డికి సీఎం వైఎస్‌ జగన్‌ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వనిం­చారు. ఆయనతోపాటు టీడీపీ నేతలు కె.శ్రీనివాసరెడ్డి, కె.రామచంద్రారెడ్డి, కె.వెంకటేశ్వరరెడ్డి, కె.ష­ణ్ముక్‌రెడ్డి, వి.శంకర్‌ కూడా సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రభు­త్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆ­య­న సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు