Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్‌ మల్లన్న గుడ్‌బై?

2 May, 2022 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న బీజేపీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. పార్టీలో ఆశించిన మేర ప్రాధాన్యత లభించని కారణంగానే మల్లన్న బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన అనుయాయులు చెబుతున్నారు. కాగా, మల్లన్న వ్యవహారంపై బీజేపీ నాయకులెవరూ స్పందించవద్దని రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు సమాచారం. తాజా పరిణామాలపై తీన్మార్‌ మల్లన్న అభిప్రాయం కనుక్కునేందుకు సాక్షి ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

తీన్మార్‌ మల్లన్న డిసెంబర్‌ 7న ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేసీఆర్‌ తనపై 38 కేసులు పెట్టినా, ఏమి సాధించలేకపోయారని బీజేపీలో చేరిన తర్వాత తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షును ఉద్దేశిస్తూ అవమానకరంగా తీన్మార్‌ మల్లన్న సోషల్‌ మీడియాలో నిర్వహించిన పోల్‌పై బీజేపీ అధిష్టానం అప్పట్లో కన్నెర్ర చేసింది. కాగా, బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని తీన్మార్‌ మల్లన్న భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు