బీజేపీ నేతల తీరు దుర్మార్గం: బాల్క సుమన్‌ 

27 Jun, 2022 02:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు దుర్మార్గమని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద, ముఠా గోపాల్, డాక్టర్‌ మెతుకు ఆనంద్, నోముల భగత్, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ సొంత రాష్ట్రం పంజాబ్‌లో ఏంచేయలేక ఇక్కడ ఏదో చేస్తానంటున్నారని, బండి సంజయ్‌ తన పార్లమెంట్‌ నియోజకవర్గం కరీంనగర్‌ను మరిచిపోయాడా అని ప్రశ్నించారు. బీజేపీ ఆఫీస్‌ దగ్గర పెట్టిన ‘సాలు దొర.. సెలవు దొర’అనే డిజిటల్‌ బోర్డు తీసేయాలని ఆయన హెచ్చరించారు. లేదంటే మోడీ బోర్డులు తెలంగాణ వ్యాప్తంగా పెట్టి చెప్పుల దండలు వేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు