ఖైదీలు జైల్లో.. అవినీతిపరులు బీజేపీలో..

27 Oct, 2021 03:06 IST|Sakshi

మద్యం, నగదుతో ఈటల ప్రలోభాలు: బాల్క సుమన్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మనదేశంలో ఖైదీలు జైల్లో ఉంటారని, అవినీతిపరులు మాత్రం బీజేపీలో ఉంటారని టీఆర్‌ఎస్‌ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మంగళ వారం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. ఈటల, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ–ఈటల ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే పనిలో పడ్డారని, చికెన్, మద్యం, నగదు పంచుతున్నారని ఆరోపించారు. దాదాపు 2000 మంది సాయుధ బలగాలను దింపి ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నా రన్నారు.

హుజూరాబాద్‌ కల్లోలిత ప్రాంతంకాకున్నా ఇంతటి భారీ స్థాయిలో బలగాలను దించాల్సిన అవసరం ఏముం దని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలు పాలైన గెల్లు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. చేతనైతే విభజన హామీలైన ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, గిరిజన వర్సిటీలను తీసుకురావాలని, పెట్రో, నిత్యా వసరాల ధరలను తగ్గించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు