రైతన్నకు అండగా నిలవండి

19 Nov, 2021 00:47 IST|Sakshi

ధాన్యం కొనుగోళ్లు జరిపేలా అధికారులపై ఒత్తిడి తెండి

పార్టీ కేడర్‌కు బండి సంజయ్‌ పిలుపు

సర్కార్‌ పెట్రోధరలు తగ్గించాలని రేపు బీజేపీ నిరసనలు...

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లు చేపట్ట కుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, బాధ్యతార హితంగా వ్యవహరిస్తున్నందున  రైతులకు బాసటగా నిలవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ఐకేపీ సెంటర్లు, మార్కెట్‌ యార్డు లను సందర్శించి కొనుగోళ్లు జరిపేలా అధికారు లపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లపై పార్టీ చేపడుతున్న ఆందోళన, నిరసనలు విజయవంతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో బీజేపీ అనుబంధ మోర్చా లు, అన్ని విభాగాలు తమ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సీఎం రెచ్చ గొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలు, టీఆర్‌ఎస్‌ నాయకుల దాడులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ కార్యక్రమా లపై.. పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేం దర్‌ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులతో బండి సంజయ్‌ చర్చిం చారు.పార్టీ నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి ప్రేమేం దర్‌రెడ్డి ఒకప్రకటనలో మీడియాకు తెలియజేశారు. 

పెట్రోధరలు తగ్గించాలని రేపు నిరసనలు:రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించి పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు వాట్‌ను తగ్గించి పెట్రోధరలను తగ్గించడం ద్వారా ప్రజలపై కొంత మేర భారాన్ని తగ్గించినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనవరి 26న దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 27, 28తేదీల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రేమేందర్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో డిసెంబర్‌ 1 నుంచి 15 వరకు, మండల స్థాయిలో డిసెంబర్‌ 16 నుండి 30 వరకు పార్టీ నాయకులకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు