2న ప్రగతిభవన్‌లో ట్రిపుల్‌ ఆర్‌ సినిమా: బండి

24 Oct, 2021 01:30 IST|Sakshi
జమ్మికుంట సభలో మాట్లాడుతున్న సంజయ్‌  

టీఆర్‌ఎస్‌ నేతలు దండుపాళ్యం ముఠా 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలిచి నవంబర్‌ 2న కేసీఆర్‌కు ట్రిపుల్‌ ఆర్‌ సినిమా చూపెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా జమ్మికుంటలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమునతో కలసి బండి సంజయ్‌కుమార్‌ ప్రసంగించారు.

తన సభలకు 20 మంది మాత్రమే వచ్చారని చెప్పినవాళ్లకు కళ్లు, చెవుల్లేవని విమర్శించారు. డబ్బు, మందు కోసమే ఎన్నికలు ఇంకొన్ని రోజులు వాయిదా పడాలని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆశపడుతున్నారని ఎద్దేవా చేశారు. తనను ఒకాయన కోతి అన్నారని, కానీ, టీఆర్‌ఎస్‌ నాయకులు దండుపాళ్యం ముఠా తరహాలో జనాలను దోచుకుంటున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

వందకోట్ల డోసుల ఘనత కేంద్రానిదే.. 
కేసీఆర్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రూ.20 వేల చొప్పున పంపుతున్నారని.. అందులో దొంగనోట్లు ఉండే ప్రమాదముందని.. ఓసారి సరి చూసుకోవాలని సంజయ్‌ సూచించారు. కిషన్‌రెడ్డిపై దాడి చేస్తే భయపడే ప్రసక్తే లేదని.. నమ్మిన సిద్ధాంతాల కోసం ఈ జమ్మికుంట గడ్డ మీద సమ్మిరెడ్డి, రవీందర్‌రావు నక్సలైట్ల తూటాలకు బలయ్యారని గుర్తు చేసుకున్నారు. తాము నక్సలైట్లను ఎదిరించినప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీగాని, కేటీఆర్‌గానీ పుట్టనేలేదన్నారు. బీజేపీకి మద్దతుగా అంతా సెల్‌ఫోన్‌ టార్చ్‌ ఆన్‌ చేయాలని కోరగానే సభకు వచ్చినవారు లైట్లు వేసి మద్దతు తెలిపారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు