అలా చెప్పి సీఎం కేసీఆర్‌ మోసం చేశారు: బండి సంజయ్‌

22 Sep, 2022 21:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడులో భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పెద్ద అంబర్‌పేట్‌లో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, దళిత వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పి దగా చేశారన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతారనే భయంతోనే నూతన సెక్రటేరియట్‌కు అంబేద్కర్‌ పేరు పెట్టారు. అయినాగానీ టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మరని బండి సంజయ్‌ అన్నారు.
 చదవండి: మునుగోడుపై కమలనాథుల వ్యూహమేంటీ? 

‘‘నిజాం సర్కార్ను తరిమికొట్టిన గడ్డ వీరపట్నం. ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నంగా మార్చాలా వద్దా? అని ప్రశ్నించారు. మునుగోడులో గెలిచేది బీజేపీయేనని ప్రజలు చెబుతున్నారు. బైపోల్ అనగానే కేసీఆర్ నోటికి వచ్చిన హామీలు ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. మునుగోడులో ఎస్సీ, ఎస్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. గిరిజన బంధు కూడా అందుకే ప్రకటించాడని అందరికీ తెలుసు’’ అంటూ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచలేదు. ఇప్పుడు పెంచింది మునుగోడు కోసం కాదా.. సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు