సీబీఐ ఛాయ్‌ బిస్కెట్‌ తినడానికి రాలేదు.. కవితపై బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

11 Dec, 2022 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీబీఐ అధికారులు ఛాయ్‌ బిస్కెట్‌ తినడానికి రాలేదంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కవిత ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా?. ఇంటి దగ్గర పెద్ద పెద్ద హోరింగ్స్‌ ఎందుకు?. తప్పు చేసిన వారు హోర్డింగ్స్‌ పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.

‘‘తప్పు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలంతా జైలుకు వెళ్లాల్సిందే. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. లిక్కర్‌ కేసులో​ కవిత దొరికిపోయారు. చట్టం తన పని తాను చేస్తుంది’’ అని బండి సంజయ్‌ అన్నారు.

కాగా, ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్యే కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ బృందం రికార్డు చేస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ఆమెను విచారిస్తున్నారు. సీబీఐ టీమ్‌ను  రాఘవేంద్ర వత్స లీడ్‌ చేస్తున్నారు. సీబీఐ అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ నెలకొంది.
చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?.. అసలు కథ ఎప్పుడు మొదలైంది? 

మరిన్ని వార్తలు