కేసీఆర్‌ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయా?

25 May, 2022 01:35 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలోని రైతులను ఏనాడూ పట్టించుకోని సీఎం కేసీఆర్‌ పంజాబ్‌ రైతు లకు చెక్కులి చ్చారని, అవిప్పుడు చెల్లుబాటు అవుతాయా? అని అక్కడి రైతులు సందేహం వెలిబుచ్చుతున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర గడ్డు పరిస్థితు లు ఎదుర్కొంటోందని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నెలకొందని, ఉద్యోగులకు జీతాలు, పింఛన్లకు సైతం డబ్బులు లేవని ఎద్దేవా చేశారు.

హనుమాన్‌ జయంతి శోభాయాత్రను పురస్కరించుకుని మంగళవారం కరీంనగర్‌లో  ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న మోదీ రాష్ట్రానికి వస్తున్నందునే కేసీఆర్‌ దేశయాత్రల కు శ్రీకారం చుట్టారని విమర్శించారు. పార్ల మెంటు సభ్యుడిగా మూడేళ్లకాలంలో తన ని యోజక వర్గానికి ఎంతో చేశానని, ఈ సమ యంలో రాజకీయాలు వద్దని, అభివృద్ధి కోసం అంతా కలిసికట్టుగా సాగుదామని టీఆర్‌ఎస్‌కు హితవు పలికారు.  కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రం కూడా తగ్గించాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు