'వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టు కేసీఆర్‌ తీరు'

11 Jun, 2022 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌ అన్నారు. తెలంగాణలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ముందు వాటిని అరికట్టడంపై కేసీఆర్ దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ మేరకు తరుణ్‌ చుగ్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రభుత్వ వాహనాలలో రేప్ జరిగింది. ముఖ్యమంత్రి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. రక్షక భటులే భక్షక భటులుగా మారారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టు కేసీఆర్‌ తీరు ఉంది. దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయి ఆయనకు కూడా జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉంది. బంగారు తెలంగాణ చేస్తానని చేయలేకపోయాడు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారంటూ' తరుణ్‌చుగ్‌ ఎద్దేవా చేశారు. 

చదవండి: (గవర్నర్‌ పిలిస్తే సీఎస్, డీజీపీలే వెళ్లరు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు