‘టీఆర్‌ఎస్‌ మళ్లీ వస్తే గొంతు కోసుకుంటా’

24 Apr, 2022 03:42 IST|Sakshi

సాక్షి,రామాయంపేట (మెదక్‌): వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తాను గొంతు కోసుకుంటానని, టీఆర్‌ఎస్‌కు ఒక్కరూ కూడా ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సవాల్‌ చేశారు. ఇటీ వల ఆత్మహత్య చేసుకున్న మెదక్‌ జిల్లా రామా యంపేటకు చెందిన సంతోష్‌ కుటుంబాన్ని అర్వింద్‌ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లీ కొడుకులు కామారెడ్డి వెళ్లి ఆత్మ హత్యకు పాల్పడ్డారంటే ఇక్కడి పోలీసులు, అధికార పార్టీ నాయకులపై వారికి అను మానాలు ఉన్నాయన్నారు. వాస్తవానికి మృతులకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు.

మరిన్ని వార్తలు