తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్‌

5 May, 2022 20:50 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: పాలమూరుపై టీఆర్‌ఎస్‌ పార్టీ కక్ష కట్టిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ సహకరిస్తే ఆర్డీఎస్‌ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అడ్డగోలు సంపాదనకే స్థానిక మంత్రి పరిమితమయ్యారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యకర్తలు ఎవరికీ భయపడరన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు. ఏం సాధించారని రాహుల్‌ గాంధీ తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్‌ అన్నారు.
చదవండి: ఏ ముఖం పెట్టుకుని ఓయూ వెళతారు? 

మరిన్ని వార్తలు