బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ దొంగ పార్టీలే: ఆర్‌ఎస్పీ 

21 Nov, 2022 02:16 IST|Sakshi

కొల్లాపూర్‌ రూరల్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ దొంగ పార్టీలేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని కుడికిల్లలో ఇటీవల పోడు భూముల సమస్యలతో నార్లాపూర్, కుడికిల్ల గ్రామాల రైతుల ఘర్షణలో గాయపడిన దళిత రైతులను పరామర్శించారు.

అనంతరం ప్రవీణ్‌ విలేకరులతో మాట్లాడుతూ అంగట్లో సరుకుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రెండు పార్టీలు ముందుగా మాట్లాడుకునే ఈ తతంగాన్ని నడిపాయని ఆరోపించారు.  కొనుగోలుకు గురైన ఎమ్మెల్యేలను దించి.. బీఎస్పీ పార్టీ వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు