జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్‌!

9 Sep, 2022 10:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ వెళ్లనున్నారు. హైదరాబాద్‌ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాతే ఫ్రంట్‌లు, పొత్తులపై వివిధ పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈ నెల 11న హైదరాబాద్‌కు మాజీ సీఎం కుమారస్వామి రానున్నట్లు తెలిసింది.
చదవండి: రాజ్‌భవన్‌.. నివురుగప్పిన నిప్పు!

ఈ క్రమంలో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శుక్రవారం మీడియాతో మాట్లాడూతూ కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందేనన్నారు. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్‌ మరో ఉద్యమం చేయాలన్నారు. మేమంతా కేసీఆర్‌ వెంట ఉంటామని వారు ప్రకటించారు.  ప్రత్యామ్నాయ శక్తి కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కార్పొరేట్‌ గద్దలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మత విద్వేషాలను రగిలిస్తున్నారని  బాల్కసుమన్‌ మండిపడ్డారు.
 

మరిన్ని వార్తలు