‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’

26 May, 2022 17:05 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు: జాతీయస్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ గురువారం కర్ణాటకలో పర్యటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మార్పు తథ్యం అని, కొన్ని నెలల్లో దేశంలో భారీ మార్పులు జరుగుతాయన్నారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానన్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేవన్నారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయన్నారు.
చదవండి: తెలంగాణ ఆ కుటుంబ దోపిడీకి గురవుతోంది: ప్రధాని మోదీ

కాగా, ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్‌ చర్చించినట్లు తెలిసింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో చర్చించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు