రైతులపై కక్షతోనే కేసీఆర్‌ ధాన్యం కొనడం లేదు 

29 Nov, 2021 02:04 IST|Sakshi

హుజూరాబాద్‌లో ఓటమితో సీఎం ‘నీరో’లా మారారు: ఈటల 

దురాజ్‌పల్లి (సూర్యాపేట)/చౌటుప్పల్, కోదాడ అర్బన్‌: ధాన్యం కొనుగోళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు చేయలేదని, మొత్తం కేంద్రమే చెల్లిస్తోందని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఉప్పు డు బియ్యం కాకుండా రా రైస్‌ ఎంతైనా కొనుగోలు చేస్తామ ని చేసిన కేంద్ర ప్రభుత్వ సూచనకు అంగీకరించిన కేసీఆర్, ఇప్పుడు కేంద్రాన్ని బ దనాం చేసే కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు.

ఆదివారం సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఓటమిని జీర్ణించుకోలేని కేసీఆర్‌ అసహనానికి గురై, నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడని, రైతులపై కక్షగట్టి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ఈ ఏడాది రూ.56 వేల కోట్ల అప్పులు చెల్లించాల్సిన దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని విమ ర్శించారు. అంతకుముందు మహాత్మాజ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా పూలే చిత్రపటానికి ఈటల పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

మరిన్ని వార్తలు