హుజూరాబాద్‌లో ఈటలను గెలిపించండి 

3 Oct, 2021 03:53 IST|Sakshi

నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా తెలంగాణకు ఆ నియోజకవర్గ ప్రజలు దిక్సూచిలా నిలవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. ఈమేరకు శనివారం ఆయన నియోజకవర్గ ఓటర్లకు బహిరంగ లేఖరాశారు. స్వయంపాలనలో తెలంగాణ పేద ప్రజలు అభివృద్ధి చెందుతారని తాను, రాజేందర్‌ నమ్మి కలిసి పనిచేశామని, కానీ సీఎం కేసీఆర్‌ అందర్నీ మోసం చేస్తున్నట్లు గ్రహించామని లేఖలో తెలిపారు. 

మరిన్ని వార్తలు