చైర్మన్‌ శ్రావణిని అవమానించిన ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేయాలి

27 Jan, 2023 02:42 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల 

సాక్షి, హైదరాబాద్‌: బీసీ సామాజిక వర్గానికి చెందిన జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌ భోగ శ్రావణిని రాజకీయంగా వేధించి, అవమాన­పరిచిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను బీఆర్‌­ఎస్‌ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఒక మహిళ మీడియా సమక్షంలో తనను వేధిస్తు­న్నా­రని కన్నీరు పెట్టుకోవడం బాధాకరమని, మహిళా చైర్మన్‌ను రాజకీయంగా అణచివే­యడమంటే మొత్తం బీసీ సమాజాన్ని అణచివే­యడమే అవుతుందని గురువారం ఒక ప్రకట­న­లో తెలిపారు.

బీఆర్‌ఎస్‌ పార్టీలో బీసీ మహి­ళ­లు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఇటీవల హైదరాబాద్‌లోని చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి కూడా స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి వేధింపులు తాళలేకి కన్నీరు పెట్టుకుందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు బీసీలను కించపర్చడం కొత్తేం కాదన్నారు. గతంలో బీసీ లేదు గోసిలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారని, రిజర్వేషన్లు ఎత్తేయాలని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యా­నించారని జాజుల తెలిపారు.

మరో వైపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తే దేనికీ పనికిరారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభలో మాట్లాడిన మాటలే నిదర్శన­మన్నారు. ఇలాంటి వాటిపై సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు. జగిత్యాల ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్‌ చేయాలని, బీసీలకు క్షమా­పణ చెప్పాలని జాజుల డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు