ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం

21 Jan, 2022 04:38 IST|Sakshi
తాతా మధుసూదన్‌ను అభినందిస్తున్న జాఫ్రీ, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ,  

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రి తాతా మధుతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్‌ కార్యదర్శి డాక్టర్‌ నరసింహాచార్యులు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు