వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

1 Nov, 2021 04:55 IST|Sakshi

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ 

నేటి నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పార్టీ పార్ల మెంటరీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో 78 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ కుటుంబం ప్రజాధనాన్ని దోచుకుంటోందని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని చెప్పారు. 30 లక్షల సభ్య త్వాలు లక్ష్యంగా డిజిటల్‌ మెంబర్‌షిప్‌ నిర్వహిస్తు న్నామని వివరించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలకు నిరసనగా నవంబర్‌ 14 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రంలో జనజాగరణ పేరిట పాదయాత్ర లు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, బోసు రాజు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి వేం నరేందర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, శివకుమార్‌రెడ్డి, వంశీకృష్ణ, శంకర్‌ప్రసాద్, నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు ఎన్‌పీ వెంకటేశ్, దుష్యంత్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, సీజే బెనహర్, శ్రీహరి, ప్రదీప్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు