కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తే చాలు బీజేపీకి వణుకు 

27 Jun, 2022 02:33 IST|Sakshi
మాట్లాడుతున్న తలసాని. చిత్రంలో  అనిల్‌ కుర్మాచలం, జగదీశ్‌రెడ్డి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ ప్రయాణం అంటేనే బీజేపీకి వణుకు పుడుతోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో మోదీ దండు హైదరాబాద్‌ వస్తోందని విమర్శించారు. ఆదివారం టీఎస్‌ఎఫ్‌డీసీ కార్యాలయంలో రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్‌ కూర్మాచలం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు