ఒకరికి పబ్‌లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్‌

10 Jun, 2022 16:00 IST|Sakshi
(ఫైల్‌ ఫొటో)

సాక్షి, జగిత్యాల:  కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ ఎంపీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జగిత్యాలలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ ఇద్దరి మీద విమర్శలు సంధించారు.

‘‘మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ చలిమంట కాచుకుంటోంది. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చేసిన అభివృద్ధి ఏంటి? రాహుల్‌ గాంధీకి పబ్‌లు తప్ప ఎడ్లు, వడ్లు గురించి ఏం తెలుసు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప బండి సంజయ్‌ చేసిందేంటి? అని కేటీఆర్‌ మండిపడ్డారు.

‘‘జన్‌ధన్‌ ఖాతాలో నగదు వేస్తామన్నారు? ఇప్పటివరకు వేశారా? తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదు. బండి సంజయ్‌ విచిత్రమైన మనిషి.. మసీదులు తవ్వాలంటారు. అసలు ఆయనకు సిగ్గు శరం ఉందా?’’ అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌.

మరిన్ని వార్తలు