మేం పిలుపు ఇస్తే తట్టుకోలేరు.. బీజేపీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపాటు 

29 Aug, 2021 00:56 IST|Sakshi

బీజేపీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపాటు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌పై చిల్లరగా మాట్లాడటం సరికాదని, మేం పిలుపు ఇస్తే మీరు తట్టుకోలేరని తెలంగాణ అల్లకల్లోలమవుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పిస్తామని గత ఎన్నికలకు ముందు అప్పటి జాతీయ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు పాదయాత్ర లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంభోదిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు