MLA Raghunandan Rao: సీఎం కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా?

29 Sep, 2021 08:33 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ వచ్చాక ఒక్క టీకా కంపెనీ ఐనా వచ్చిందా?

కేటీఆర్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే రఘునందన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క టీకా తయారీ కంపెనీ ఐనా వచ్చిందా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ పుట్టడానికి ముందు నుంచే రాష్ట్రంలో, హైదరాబాద్‌లో పలు ఫార్మా కంపెనీలున్నాయన్న సంగతి గుర్తెరగాలన్నారు. ‘కేసీఆర్‌ వచ్చాకే తెలంగాణ ప్రజలు భోజనం చేస్తున్నారు. పోలియో టీకాలు వేసుకుంటున్నారు అన్న విధంగా టీఆర్‌ఎస్‌ వ్యవహారం ఉంది’అని రఘునందన్‌ ఎద్దేవాచేశారు. అసలు సీఎం కేసీఆర్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారా? అని ప్రశ్నించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణను అవమానపరిచినట్లు అని కేటీఆర్‌ మాట్లాడడడం సరైందికాదన్నారు. ఫార్మాసిటీకి సంబంధించి ముచ్చర్లలో పది వేల ఎకరాలు సేకరించినప్పుడు రాని ఇబ్బందులు మిగిలిన రెండు వేల ఎకరాలకు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. ఐటీఐఆర్‌ రీజియన్‌ని ఎందుకు ఏర్పాటు చేయలేదో గత యూపీఏ ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. పరిశ్రమల మంత్రిగా రేయాన్‌ ఫ్యాక్టరీ, నిజాంషుగర్, అజంజాహిమిల్, ప్రాగా టూల్స్, ఆల్విన్‌ కంపెనీలను తెరిపించే సంగతేంటో కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్‌చేశారు. సిరిసిల్లకు ఎన్ని లక్షల బతుకమ్మ చీరలకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారో, దుబ్బాక నుంచి ఎన్ని తెచ్చారో చెప్పాలని రఘునందన్‌ డిమాండ్‌చేశారు.  
చదవండి: ‘కోదండరాంపై బట్టలు చినిగిపోయేలా దాడి చేయడం దారుణం’

కేటీఆర్‌ పుట్టకముందే రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధి 
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేనిది చూసి మంత్రి కేటీఆర్‌ ఎగిరెగిరి పడ్డారని, ఆయన పుట్టకముందే తెలంగాణలో ఫార్మారంగం అభివృద్ధి చెందిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి హితవుపలికారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. మంగళవారం గాం«దీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కాకముందే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారత్‌ బయోటెక్, ఐడీపీఎల్, రెడ్డి ల్యాబ్స్‌ లాంటి ఫార్మా పరిశ్రమలు హైదరాబాద్‌లో ఏర్పడ్డాయని చెప్పారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక 36 లక్షల మంది పారిశ్రామిక రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని, అనేక పరిశ్రమలు మూతపడ్డాయని, పఠాన్‌చెరు లాంటి ఇండ్రస్టియల్‌ జోన్‌లో 50 శాతం కాలుష్యం పెరిగిందని విమర్శించారు. కాలుష్య నియంత్రణ మండలిని పనిచేయనీయకుండా పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించి టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సు«దీర్‌రెడ్డి మాట్లాడుతూ మొన్న కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తే హుజూరాబాద్‌ ఎన్నికలు ఆగిపోయాయని, ఇప్పుడు ఢిల్లీ వెళ్లి రాగానే అదే హుజూరాబాద్‌కు నోటిఫికేషన్‌ వచి్చందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్‌ చేతిలో బీజేపీ కీలు»ొమ్మ అయిందని, ఈ ఎపిసోడ్‌లో ఈటల రాజేందర్‌ బకరా అయ్యారని సు«దీర్‌రెడ్డి ఎద్దేవాచేశారు.  

కళాకారులు లేని పోరాటం లేదు: జూలకంటి 
దురాజ్‌పల్లి(సూర్యాపేట): కళాకారులు లేని పోరాటం లేదని, ప్రజా ఉద్యమాలకు పాట ఆయుధమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ ఫంక్షన్‌హాల్‌లో ప్రజానాట్యమండలి రాష్ట్ర రెండో మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజా ఉద్యమాల కేంద్రమైన సూర్యాపేటలో ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం శుభసూచకమన్నారు. దేశంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్న సందర్భంలో ఈ సభల నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన ప్రభుత్వాలు ప్రజలకిచి్చన ఏ హామీనీ అమలు చేయలేదని ఆరోపించారు.

దేశంలో బీజేపీ పరిపాలన వచ్చిన తర్వాత కవులు, కళాకారులు, రచయితలకు రక్షణ కరువైందన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి శాంతారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, వ్యవసాయ కారి్మక సంఘం జాతీయ కౌన్సిల్‌ సభ్యులు ములకలపల్లి రాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బచ్చలకూరి రాంబాబు, వేల్పుల వెంకన్న పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు