జోనల్‌ సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాలు

8 Dec, 2021 02:41 IST|Sakshi

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ విధానం ద్వారా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇస్తుందని మంత్రి, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. టీజీవో సంఘం అధ్యక్షురాలు మమత నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు బుధవారంలోగా ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు.

జోనల్‌ విధానం పూర్తయితే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో తెలుస్తుందన్నారు. మమత మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు రాకుండా జోనల్‌ విధానం ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఉద్యోగులు వెంటనే ఆప్షన్‌ పత్రాలపై సంతకాలు చేయాలని టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సూచించారు. సమావేశంలో టీజీవో కేంద్ర సంఘం నాయకుడు సహదేవ్, రవీందర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు