నేడే ప్రతిపక్షాల ‘మహాధర్నా’ 

22 Sep, 2021 07:46 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన 

హాజరుకానున్న సీతారాం ఏచూరి, రేవంత్‌రెడ్డి తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం రాష్ట్రంలోని ప్రతిపక్ష పారీ్టలు ‘మహాధర్నా’కార్యక్రమాన్ని నిర్వహించనున్నా యి. బీజేపీ, టీఆర్‌ఎస్‌యేతర పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలు, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీలతోపాటు పలు ప్రజా, కులసంఘాలు ఈ ఆందోళనకు హాజరుకానున్నాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఇందిరాపార్కు వద్ద కార్యక్రమాన్ని నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాధర్నాలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డితోపాటు సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్‌), తెలంగాణ ఇంటి పార్టీ, సీపీఐఎంఎల్‌ (న్యూడెమొక్రసీ), సీపీఐఎంఎల్‌ (లిబరేషన్‌) పారీ్టల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పలు ప్రజా, కుల సం ఘాల ప్రతినిధులు మంగళవారం గాంధీ భవన్‌లో భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, సీనియర్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌తోపాటు ప్రజాసంఘాల నేతలు కోల జనార్దన్, రవిచంద్ర, విఠల్, భూమయ్య, పాశం యాదగిరి, సలీంపాషా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణలో మరో విముక్తి పోరాటానికి సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని, దగాకోరు ప్రభుత్వం చేతుల్లో ప్రజలు అల్లాడుతు న్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలతో రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేసిందని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల ఆటవికపాలన నుంచి అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలో జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిపక్ష పారీ్టలు ఉద్యమానికి సిద్ధమయ్యాయని అన్నారు.

మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం మొదలైందని చెప్పారు. ఇటీవల ప్రతిపక్ష పారీ్టలు సమావేశంకాగా, ఇప్పుడు 20 ప్రజాసంఘాలు భేటీ అయ్యాయని, ఈ సమావేశాల్లో ఖరారవుతున్న పోరాట ఎజెండాలే బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు చరమగీతం పాడుతాయన్నారు.   

మరిన్ని వార్తలు