Huzurabad Bypoll: హుజురాబాద్‌లో పోటీకి కేసీఆర్‌ సై అంటే.. బరిలోకి రేవంత్‌రెడ్డి

10 Sep, 2021 02:34 IST|Sakshi

టీపీసీసీ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీచేస్తే ఆయనకు పోటీగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతారని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డిలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

రాష్ట్రంలో దళితబంధు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌..ఆయన దత్తత గ్రామం వాసాలమర్రిలో సైతం ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కేసీఆర్‌ కలవగానే హుజూరాబాద్‌ ఉపఎన్నికలు వాయిదా పడ్డాయని, దీంతో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి పోస్టు కూడా వాయిదా పడిపోయిందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు కలసి లోపాయికారీగా పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీని కలసి కేసీఆర్‌ అక్రమాలపై విచారణకు ఆదేశించేలా పట్టుబట్టాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు