-

కేసీఆర్‌ వస్తే ప్రధాని వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తా: బండి సంజయ్‌

12 Sep, 2021 19:20 IST|Sakshi

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఏం చేసినా గెలవదని వ్యాఖ్య

మెదక్‌లో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర

సాక్షి, మెదక్‌: రాష్ట్ర సమస్యలపై సీఎం కేసీఆర్‌ కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లి పరిష్కరిస్తాను అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కి ఢిల్లీ వెళ్లి వచ్చాక టెన్షన్ పట్టుకుందని పేర్కొన్నారు. ఫాంహౌస్ నుంచి సీఎం బయటకు రావడం లేదని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం మెదక్‌ జిల్లాలో సంజయ్‌ మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తర్వాత మేయర్ పదవి ఇస్తామని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారని తెలిపారు. అయితే మేయర్ పదవి వద్దు, 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పినట్లు పేర్కొన్నారు. తలకిందకు, కాళ్లుపైకి చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలవదని స్పష్టం చేశారు.
చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్‌

దళిత బంధుతో పాటు బీసీ, గిరిజన బంధు ఇవ్వాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆయుష్మాన్ భారత్‌లో చేరకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రూ.10 వేలు కోట్లతో 2 లక్షల 91 వేలు ఇళ్లు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని వివరించారు. ఒక్కొక్క నిరుద్యోగికి ప్రభుత్వం రూ.లక్ష బాకీ ఉందని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి మీద రూ.లక్ష అప్పు ఉందని చెప్పారు. కేంద్రం నిధులతో రాష్ట్రం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.
చదవండి: బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్‌చల్‌

కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించమని తెలంగాణ తల్లి ఘోషిస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి ఒంగిఒంగి దండాలు పెట్టాడు.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కోర్టుకి వెళ్లి వినాయక నిమజ్జనానికి అనుమతి తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు