కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు భరోసా ఇవ్వలేరా? 

20 Dec, 2022 02:36 IST|Sakshi

ట్విట్టర్‌ వేదికగా సీఎంను ప్రశ్నించిన షర్మిల   

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ పథకంలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కాస్తంత భరోసా ఇవ్వలేరా అని సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సోమవారం ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. ‘పండుగ లేదు, పబ్బం లేదు, రోజూ పనిచేస్తున్నారు. అయినా వారు కాంట్రాక్టర్ల వేధింపులకు గురవుతున్నారు’అని వాపోయారు. గ్రామీణ జనానికి నీళ్లు అందిస్తున్న 15 వేల మంది మిషన్‌ భగీరథ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు.

కాంట్రాక్ట్‌ కార్మికుల చట్టబద్ధ హక్కులను కాలరాస్తూ, వారికి కనీసవేతనాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. మిషన్‌ భగీరథ పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రగతిభవన్‌ సారుకు కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలన్న సోయి లేదా అని షర్మిల ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు