నిరుద్యోగులకు కేసీఆర్‌ అన్యాయం చేశారు

29 Jun, 2022 02:06 IST|Sakshi
నిరుద్యోగ నిరాహార దీక్షలో కూర్చున్న వైఎస్‌ షర్మిల 

చివ్వెంల(సూర్యాపేట): తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీరని అన్యా యం చేశారని, ఇచ్చిన ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శిం చారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల మంగళవా రం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని మోదిన్‌పురంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్‌కు దున్నపోతు మీద వానపడినట్లు కూడా లేదన్నారు.

రాష్ట్రంలో రెండు లక్షల ఉగ్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బాధ్యత లేని కేసీఆర్‌ వాటి ఊసే మరిచారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో 3,500 బడులు మూసివేశారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలో పాఠశాలలు చూశాం. తరగతి గదులు లేక చెట్లకిందే కూర్చుంటున్నారు. బాత్‌రూంలు లేవు. మంచి నీళ్లు లేవు. సీబీఎస్‌ఈ, ఇంగ్లిష్‌ మీడియం అన్నారు.

పిల్లలకు ఉచిత వైద్యం అన్నారు. అవన్నీ ఎక్కడ?’ అని షర్మిల ప్రశ్నించారు. యూనివర్సిటీలు అధ్వానంగా మారాయని, మçహాత్మా గాంధీ యూనివర్సిటీకి సున్నం వేయించడం కూడా సీఎంకు చేతకావడం లేదని ఎద్దేవా చేశారు.  ప్రజల పక్షాన పోరాడేది వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ మాత్రమేనన్నారు.

మరిన్ని వార్తలు