నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే 

27 Mar, 2022 03:02 IST|Sakshi

తిరుమలగిరి(తుంగతుర్తి): రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఏడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా 37వ రోజైన శనివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాట– ముచ్చట’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉన్నత చదువులు చదివిన యు వత కేసీఆర్‌ పాలనలో ఉద్యోగాలు రాక కూలి పనులు, కుల వృత్తులకే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైఎస్సార్‌టీపీ  కో ఆర్డినేటర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్‌: పార్టీ బలోపేతంలో భా గంగా షర్మిల రాష్ట్ర అధికార ప్రతినిధుల తో పాటు రాష్ట్ర యువత విభాగం, విద్యార్థి విభాగాలకు కో ఆర్డినేటర్లను నియమించా రు. ఈ మేరకు పార్టీ కార్యాలయం శనివారం ఓ ప్ర కటన విడుదల చేసింది. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా తూడి దేవేందర్‌ రెడ్డి, గట్టు రామచందర్‌రావు, ఏపూరి సోమన్న, పిట్ట రాం రెడ్డి, సయ్యద్‌ ముజ్తబా అహ్మద్, సత్యవతి, భూమిరెడ్డి, బోర్గి సంజీవ్, కేటీ నరసింహా రెడ్డి, డాక్టర్‌ కె.నగేశ్‌ నియమితులయ్యా రు.

స్టేట్‌ యూత్‌ కోఆర్డినేటర్లుగా సయ్యద్‌ అజీ మ్, సుమన్‌ గౌడ్, గడ్డం హిందుజారెడ్డి, అద్నాన్‌ ఖాన్, నంబూరి కార్తీక్‌తో పాటు మ రో 8 మందిని నియమించారు. స్టేట్‌ స్టూడెం ట్‌ కో ఆర్డినేటర్లుగా విజయ్‌ కుమార్, ఎస్, నాగరాజ్‌ చక్రవర్తి, డి. శివారెడ్డి, గడ్డం అశోక్, ఎల్‌. విజయ్‌ కుమార్, గడ్డం ఆదాము నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షునిగా లక్కినేని సుధీర్‌ బాబు, హుజూర్‌నగర్‌ నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గా ఆదెర్ల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. 

మరిన్ని వార్తలు