పూటకో మాటతో రైతులను ముంచారు

30 May, 2022 01:17 IST|Sakshi
ఖమ్మం జిల్లా సదాశివునిపాలెంలో  రైతుగోస ధర్నాలో మాట్లాడుతున్న షర్మిల 

సత్తుపల్లి: పూటకో మాట మాట్లాడి సీఎం కేసీఆర్‌ రైతులను నట్టేట ముంచారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. వరి వేస్తే ఉరే అని చెప్పడంతో రాష్ట్రంలో ఈ ఏడాది యాసం గిలో 17లక్షల ఎకరాల్లో పంట లు వేయలేదని, తద్వారా రైతు లు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల చేపట్టిన 78వ రోజు పాదయాత్ర ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం చేరుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన రైతుగోస ధర్నాలో ఆమె మాట్లాడుతూ...వరి వేయకుండా నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 60 ఏళ్లు దాటితే రైతు బీమా ఇవ్వని సీఎం..69 ఏళ్లు వచ్చినా రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. తనను ఆశీర్వ దిస్తే రాజన్న సంక్షేమ పాలన తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు