Evening Top 10 News: తెలుగు తాజా వార్తలు 10

28 Jul, 2022 17:57 IST|Sakshi

1. మంత్రి పార్థా ఛటర్జీకి షాకిచ్చిన సీఎం మమత
టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీకీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ వేటేశారు. టీచర్ల నియామకానికి సంబంధించిన కేసులో ఛటర్జీ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. విద్యుత్‌ శాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని, దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యుత్‌ శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌
క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్‌ స్పందించాడు. క్యాసినో విషయంలోనే ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు మీడియాతో చెప్పాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కేంద్రం కంటే ఏపీ ఆర్థిక స్థితి బెటర్‌.. రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది: ఎంపీ విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్‌ జగన్‌ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. సీఎం జగన్‌ కా​కినాడ జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఇదే..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శుక్రవారం) కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఆసియాలోనే అత్యంత ధనికురాలు.. ఏడాది తిరిగేసరికి సగం సంపద ఫసక్‌
ఆమె ఒక బడా వ్యాపారవేత్త. నాలుగు రోజుల్లో రెండు బిలియన్ల సంపద ఆర్జించి.. యుక్తవయసులోనే ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది.. ఆసియాలోనే అత్యంత సంపద ఉన్న మహిళగా ఖ్యాతికెక్కింది. ప్చ్‌.. కానీ, అది ఏడాది కిందటి మాట. ఇప్పుడామె ఆస్తి సగం కరిగిపోయింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ‘సోనియా జీ’ మీరు కూడా మహిళే కదా: నిర్మలా సీతారామన్‌ ఫైర్‌
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ డిమాండ్‌ చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. విక్రాంత్‌ రోణ సినిమా రివ్యూ
కొమరట్టు గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో ఓ పాడుబడ్డ ఇంట్లోని బావిలో శవాలు కనిపిస్తుంటాయి. బ్రహ్మరాక్షసుడే వీరందరినీ చంపుతున్నాడని గ్రామస్తుల నమ్మకం. ఊరిపెద్ద జనార్థన్‌ గంభీర్‌(మధుసూదన్‌రావు), అతని తమ్ముడు ఏక్‌నాథ్‌ గంభీర్‌(రమేశ్‌ రాయ్‌)కూడా గ్రామ ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పి ఆ ఇంటివైపు ఎవరినీ వెళ్లకుండా చేస్తారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. భారత్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా టీ20 సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. విండీస్‌తో తొలి వన్డేకు ముందు నెట్స్‌లో జడేజా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో అతడు విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ట్విన్‌ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం: భారీ తరలింపులు, హై టెన్షన్‌!
నోయిడా వివాదాస్పద, అక్రమ  జంట టవర్ల కూల్చివేతకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 21 న నోయిడాలోని సెక్టార్ 93Aలో సూపర్‌టెక్  జంట టవర్లు అపెక్స్ (32 ఫోర్లు), సెయానే (31 ఫోర్ల)కూల్చివేతకు రంగం సిద్దమైంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు