Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

15 Sep, 2022 18:01 IST|Sakshi

1. 58 ఏళ్లలో చంద్రబాబు ఏ రోజూ ఇలా చేయలేదు: సీఎం జగన్‌
అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి ఉద్యమాలా అని ప్రశ్నించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవలేని ఆమె అమరావతి గురించి మాట్లాడటమా?
మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు
కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. నితీశ్ కుమార్ ఆ పని చేస్తే చేతులు కలుపుతా.. ప్రశాంత్ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు
బిహీర్ సీఎం నితీశ్ కుమార్‌తో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్. ఆయనతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ ఒక్క షరతు విధించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. నాలుగు రోజుల్లో నన్ను అరెస్టు చేయాలి.. లేదంటే క్షమాపణలు చెప్పాలి..
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆ పార్టీ విడుదల చేసిన స్టింగ్‌ వీడియోపై మండిపడ్డారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ‘లక్ష రూపాయల ల్యాప్‌టాప్‌..రూ.40వేలకే ఇవ్వొచ్చు’!
వేదాంత రిసోర్సెస్‌..దేశంలో మెటల్‌ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్‌, కాపర్‌, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌!
టీ20 ప్రపంచకప్‌-2022కు ముం‍దు పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశం కన్పిస్తోంది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్ మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌తో పాటు, టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టాలీవుడ్‌ నెం.1 హీరో ప్రభాస్‌.. హీరోయిన్‌ సమంత!
బాహుబలి చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్‌. ఆ తర్వాత వరుసగా పాన్‌ ఇండియా సినిమా చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాయి. అయితే బహుబలి సిరీస్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి.. దానినే పడవగా మార్చి.. నదిని దాటి.. ఆపై!
భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి, దానినే పడవగా మార్చుకున్నాడు. గుమ్మడిపండు డొల్లలో కూర్చుని, తెడ్డు వేసుకుంటూ నదిని దాటేసి, గిన్నిస్‌ రికార్డు సాధించాడు. విచిత్రమైన ఈ రికార్డు సాధించిన వ్యక్తి వయసు అరవయ్యేళ్లు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. కూతురితో అసభ్య ప్రవర్తన..హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు
వరుసకు కూతురయ్యే బ్యూటీషియన్‌పై అసభ్యంగా ప్రవర్తించిన ఏపీకి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ మహేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదైంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు