Telugu Trending News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

30 Jun, 2022 16:36 IST|Sakshi

1. Maharashtra Politics: ‘మహా’ ట్విస్ట్‌.. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ షిండే!
మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే ఈరోజు (గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం.. ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా  ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కుప్పంలో తమిళ యాక్టర్‌ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒకే క్లిక్‌తో రిజల్ట్స్‌ చూడండి
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల ఫలితాల కోసం సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. దళారీలకు టీటీడీ చెక్‌.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం
దళారీ వ్యవస్థకు టీటీడీ చెక్‌ పెడుతుండడంతో శ్రీవారి ఖజానా కాసులతో నిండుతోంది. సిఫార్సు వ్యవస్థని ఆసరాగా చేసుకొని జేబులు నింపుకుంటున్న దళారులను ఇంటిదారి పట్టించడంతో శ్రీవారి ఖజానాకు ఏడాదికి రూ.500 కోట్లు పైగానే ఆదాయం లభిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. హైదరాబాద్‌ కలెక్టర్‌గా అమయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా (ఎఫ్‌ఏసీ–పూర్తిఅదనపు బాధ్యతలు) రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి
మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఇంగ్లండ్‌తో టెస్టుకు కెప్టెన్‌ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? వ్యూహాలు రచించలేరా?
టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టుకు సారథిగా జస్‌ప్రీత్‌ బుమ్రా పేరు దాదాపుగా ఖరారైనట్లే! ఒకవేళ అదే జరిగితే భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ తర్వాత కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్న మొదటి పేసర్‌గా బుమ్రా నిలవనున్నాడు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. Major: మేజర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..
యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మేజర్‌. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్‌ హీరో మేజర్ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. సీతారామన్‌ టంగ్‌ స్లిప్‌: కేటీఆర్‌ కౌంటర్‌, వైరల్‌ వీడియో
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ టంగ్‌ స్లిప్‌ అయిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. గుర్రపు పందాలపై జీఎస్‌టీ అంశం గురించి మాట్లాడుతున్నపుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్‌ ట్రేడింగ్‌పై జీఎస్‌టీ అన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. టీమ్‌వ్యూమర్‌, ఎనీడెస్క్‌ వంటివి డౌన్‌లోడ్‌ చేయమంటారు? ఓటీపీ చెబితే అంతే సంగతులు!
సుందర్‌ టీవీ చూస్తూ టిఫిన్‌ చేస్తున్నాడు. కాసేపట్లో ఆఫీసుకు బయల్దేరాలి. అప్పుడే ఫోన్‌ రావడంతో విసుగ్గా ఆన్సర్‌ చేశాడు. అవతలి నుంచి క్రెడిట్‌ కార్డ్‌ బోనస్‌ పాయింట్స్‌ రిడీమ్‌ చేసుకోమంటూ కస్టమర్‌ కేర్‌ కాల్‌. కట్‌ చేద్దామంటే పాయింట్స్‌ గురించి చెబుతున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు