Telugu Trending News Today: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

5 Jul, 2022 09:52 IST|Sakshi

1. Jagananna Vidya Kanuka: రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక
కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కానిస్టేబుల్‌పై దాడి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ ఇంటికి 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్‌ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Russia-Ukraine War: లుహాన్‌స్క్‌లో జెండా పాతేశాం: పుతిన్‌
తూర్పు ఉక్రెయిన్‌లోని అత్యంత కీలకమైన డోన్బాస్‌లో భాగమైన లుహాన్‌స్క్‌ ప్రావిన్స్‌లో రష్యా విజయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సోమవారం ఖరారు చేశారు. లుహాన్‌స్క్‌లో జెండా పాతేశామని అన్నారు. ఈ ప్రాంతంపై రష్యా సైన్యం పూర్తిస్థాయిలో పట్టుబిగించడంతో ఉక్రెయిన్‌ సేనలు ఆదివారం వెనుదిరిగాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘కాళీ’ పోస్టర్‌పై తీవ్ర వివాదం.. ‘బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటా’
‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్‌ తీవ్ర వివాదానికి దారితీసింది.  కెనడాలోని ఆగాఖాన్‌ మ్యూజియంలో ఈ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాళీ మాత పాత్రధారి సిగరెట్‌ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌(ఎల్‌జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్‌లో కనిపిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. వ్యాక్సినేషన్‌ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు
కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్‌ను అందజేసిన భారత్‌ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్‌పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లకపోవడం బెటర్‌!
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్‌ మీనింగ్‌ ఉండదు : నాగచైతన్య
తాను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని, డబుల్‌ మీనింగ్‌లో మాట్లాడడం రాదని నాగచైతన్య అన్నారు. చైతూ, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్‌, అవికా గోర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. IND vs ENG 5th Test: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్‌ అద్భుతం చేయగలదా?
ఇంగ్లండ్‌ ముందు 378 పరుగుల లక్ష్యం... ఒకదశలో స్కోరు 107/0... ఇంగ్లండ్‌దే పైచేయిగా అనిపించింది. ఇంతలో బుమ్రా బౌలింగ్, బ్యాటర్ల స్వయంకృతం కలిపి 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... 109/3... భారత్‌కు పట్టు చిక్కినట్లే కనిపించింది. కానీ రూట్, బెయిర్‌స్టో అనూహ్యంగా ఎదురు దాడికి దిగారు. నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్‌ ఇంత సులువా అన్నట్లుగా పరుగులు సాధిస్తూ దూసుకుపోయారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ!
ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్‌ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది.  భారత్‌ ఎగుమతులు జూన్‌లో 17 శాతం పెరిగి 38 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్‌ డాలర్లకు చేరింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మిస్‌ ఇండియా 2022: తుళు సౌందర్యానికి మరో కిరీటం
ఐశ్వర్యా రాయ్‌... శిల్పా శెట్టి... శ్రీనిధి శెట్టి... అందాల పోటీల్లో కిరీటాలు సాధించారు. ముగ్గురూ ‘తుళు’ భాషీయులే. కేరళ, కర్నాటక, గోవా ప్రాంతాలలో ఉండే తుళు భాషీయుల నుంచే ఇప్పుడు మరో సౌందర్యరాశి దేశాన్ని పలుకరించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు