Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

20 Sep, 2022 17:38 IST|Sakshi

1. బసవతారకం ఆస్పత్రిలో కూడా ఆ మాటలు వినిపిస్తున్నాయి: సీఎం జగన్‌
వైద్యరంగంలో నాడు-నేడుతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. నిర్మాణంపైనే కాదు నిర్వహణపైనా దృష్టి పెట్టాం: సీఎం జగన్‌
విద్యారంగంలో నాడు- నేడుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోందన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. సీఎంగా? వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గానా... కుదిరితే రెండునా!.. సందిగ్ధ స్థితిలో రాజస్తాన్‌ సీఎం
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్‌ 17న జరగనున్న సంగతి తెలిసింది. కాం‍గ్రెస్‌ 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ పదేపదే కోరారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యారీ ప్రవర్తనపై విమర్శలు!
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. Viral: మ్యాట్రిమోనీలో యాడ్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లు కాల్‌ చేయద్దంటూ..
ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్‌లోడ్‌ చేసేస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Dussehra 2022: నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధం
హైదరాబాద్ మహానగరం మరో వేడుకకు సిద్ధమవుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాలకు సమాయత్తమవుతోంది. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అనంతరం నిమజ్జనం గావిస్తారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వ‌న్‌ప్ల‌స్ కళ్లు చెదిరే డీల్స్‌, ఆఫర్లు
ఫెస్టివ్‌ సీజ‌న్‌లో కస్టమర్లను ఆఫర్ల వర్షం రారమ్మని పిలుస్తోంది. ఇప్పటికే ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబ‌ర్ 23 నుంచి డిస్కౌంట్‌సేల్‌కు తెరలేవనుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఆస్ట్రేలియాతో మూడో టీ20.. ఉప్పల్‌ మ్యాచ్ టికెట్స్ విషయంలో రగడ!
టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మంగళవారం(సెప్టెంబర్‌ 20) మోహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మల్టీప్లెక్సుల్లో 75 రూపాయలకే హ్యాపీగా సినిమా చూసేయండి..
మూవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌. మల్టీప్లెక్సుల్లో కేవతం 75 రూపాయలకే సినిమా చూసే ఛాన్స్‌ రాబోతుంది. సాధారణంగా మల్టీప్లెక్సుల్లో 250 నుంచి 400వరకు( పెద్ద సినిమాలకు) టికెట్‌ రేటు ఉంటుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సంబంధంలేని గొడవలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు
గొడవతో సంబంధం లేదు... గొడవ పడుతున్న వారితోనూ ఎటువంటి స్నేహం లేదు.. స్నేహితుడి ఇంటి వద్ద దించేందుకని వచ్చిన యువకుడు సంబంధం లేని తగాదాలోకి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకున్న విషాదకర సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు