టీడీపీకి ‘తూర్పు’ సెగ

28 Jan, 2024 03:56 IST|Sakshi

మంగళగిరికి రాజానగరం, రాజోలు సీట్ల పంచాయితీ

జనసేన అభ్యర్థుల ప్రకటనతో తెలుగుదేశం శ్రేణుల ఆందోళన 

టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మరీ నిరసన 

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఎదుట ఆగ్రహం 

తమ సీట్లను జనసేనకు ఎలా కేటాయిస్తారని మండిపాటు

సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఆ రెండు సీట్లలో పవన్‌ కళ్యాణ్‌ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలను నిలదీశారు.

రాజోలు టీడీపీ ఇన్‌చార్జి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో చంద్రబాబు లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో మాట్లాడారు. రాజానగరం నేతలు అచ్చెన్నకు వినతిపత్రం ఇచ్చారు.  చంద్రబాబు త్వరలో రాజానగరం, రాజోలు నాయకులతో మాట్లాడతారని అచ్చెన్న సర్దిచెప్పారు.

కార్యకర్తలు వినకపోవడంతో తర్జనభర్జన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సూ­చ­నల ప్రకారం ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన తెలిపారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అచ్చెన్న వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా కొద్దిసేపు ఉండి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.

రాజాన‘గరం’
రాజానగరం విషయంలో చంద్రబాబు వ్యవహా­ర శైలి ఆది నుంచీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ తీరుపై గతంలో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశా వ్‌. అధికారంలో ఉండగా అనుభవించి, ఇప్పు­డు గాలికి వదిలేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. బాబు వ్యవహా­ర శైలితో విసుగు చెందిన పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తర్వా­త నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ దుకా­ణం కొన్నాళ్లు బంద్‌ అయింది. పెందుర్తి కి అప్రధాన పదవి అప్పగించారు.

ఆయన పార్టీ కార్య­క్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం బొడ్డు వెంకట రమణ చౌదరి­ని నియోజకవర్గ ఇన్‌చార్జి­గా ప్రకటించారు. రాజా­నగరం టికెట్‌ తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ చౌదరి ధీమాగా ఉన్నా­రు. ఈ తరుణంలో పవన్‌ ప్రకటనతో చౌదరి వర్గంలో ఆగ్రహం పెల్లుబికింది. రాజానగరం టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడి­కి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయి­తే ఇది ఫేక్‌ అని ప్రచారం చేసేందుకు టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega