వాపునే బలంగా భావిస్తున్న బీజేపీ

13 Nov, 2020 13:37 IST|Sakshi

తిరుపతి పార్లమెంట్‌ ఉప పోరుకు

రెడీ అంటున్న కమల దళం

క్షేత్రస్థాయిలో దిశాదశాలేని నాయకత్వం

ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికెగిరినట్టు .. రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటు లేదు.. ఏకంగా పార్లమెంట్‌ స్థానానికే పోటీ చేస్తామని బీజేపీ నేతలు బీరాలు పలుకుతున్నారు. క్షేత్ర స్థాయిలో సత్తా లేకపోయినా జనసేనతో కలిసి పోటీ చేస్తామని జబ్బలు చరుస్తున్నారు. తెలంగాణలోని దుబ్బాక వాపుతో ఇక్కడా బలిసినట్లు భ్రమపడుతున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన ఘనులు.. తిరుపతి ఉప పోరులో తమదే విజయమని ప్రకటనలు గుప్పిస్తున్నారు. గత సంప్రదాయాలను తుంగలో తొక్కి పోటీకి దిగాలను కోవడం సిగ్గుచేటని పలువురు విమర్శిస్తున్నారు

సాక్షి, తిరుపతి: దుబ్బాక విజయంతో బీజేపీ తిరుపతి పార్లమెంట్‌ ఉప పోరుకు రెడీ అయ్యింది. అది కూడా జనసేనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు ఆకస్మిక మృతితో ఆ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి బీజేపీ ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందిస్తోంది. అందులో భాగంగా గురువారం తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌థియోదర్‌ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలతోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లె నియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు

సంప్రదాయానికి నీళ్లు 
ఎవరైనా ప్రజాప్రతినిధి ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయంగా వస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో ఆ సంప్రదాయాన్ని రాజకీయ పారీ్టలు పాటిస్తూ వచ్చాయి. గతంలో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆకస్మిక మృతితో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. అప్పట్లో ఎన్నికలు జరిగినా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీకి దూరంగా నిలిచింది. ఇప్పుడు బీజేపీ–జనసేన, కాంగ్రెస్, టీడీపీ అత్యుత్సాహంతో పోటీకి సిద్ధమవుతున్నాయి. చదవండి: నీరు–చెట్టు, అమరావతి పేరిట రూ.2,300 కోట్ల స్కామ్

పార్టీకి దూరం.. టీవీ సమీక్షలకు పరిమితం
తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీలో చెప్పుకోదగ్గ ప్రజానాయకుడు లేరు. కీలక పదవిలో ఉన్న నాయకుల అనుచరులుగా చెలామణి అవుతున్నవారే ఎక్కువగా ఉన్నారన్న వి మర్శలున్నాయి. పార్టీ అండతో గత ప్రభుత్వంలో టీటీడీలో కీలక పదవి దక్కించుకున్న నాయకుడు ఒకరు దాన్ని అడ్డం పెట్టుకుని సొంతింటిని చక్కదిద్దుకున్నారే ప్రచారం ఉంది. పార్టీని బలోపేతం చేసేందుకు ఏనాడూ ప్రయతి్నంచలేదని సొంత పార్టీ శ్రేణులే విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే బీజేపీ అగ్రనేతలకు స్వాగతం పలికేందుకు, ఆ తర్వాత దేవుని దర్శనం పేరుతో వీఐపీలతో కలిసి తిరుమలలో చక్కర్లు కొట్టడం తప్ప చేసేదేమీ లేదనే ప్రచారం ఉంది. వీళ్లను చూడాలంటే టీవీల్లో లేదా పత్రికల్లో తప్ప మామూలుగా కనిపించకపోవడం గమనార్హం.

తిరుపతి.. ఎవరికెంత పరపతి  
తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా, అందులో కాంగ్రెస్‌ 12, రెండు పర్యాయాలు వైఎస్సార్‌సీపీ, ఒకసారి టీడీపీ, మరొకసారి బీజేపీ గెలుపొందాయి.  2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాం టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు 37,425 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్షి్మపై 2,28,376 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బి.శ్రీహరిరావుకు 16,125  ఓట్లు రాగా.. నోటాకు  25,781 ఓట్లు పడ్డాయి. నాడు జనసేన మిత్రపక్షమైన బీఎస్పీ అభ్యర్థి దగ్గుమాటి శ్రీహరిరావుకు 20,971 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు రావడం గమనార్హం.    

మరిన్ని వార్తలు